నాలుగు సర్క్యూట్లుగా పర్యాటక అభివృద్ధి

14 Oct, 2016 22:50 IST|Sakshi
కాకినాడ సిటీ :
జిల్లాలో పర్యాటక ప్రాంతాలను నాలుగు సర్కూ్యట్స్‌గా విభజించి వివిధ పనులు చేపట్టనున్నట్టు కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో పర్యాటక, అటవీశాఖ అధికారులతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సర్కూ్యట్స్‌లో భాగంగా కోనసీమ బ్రాకిష్‌ సర్కూ్యట్‌లో దిండి, బోడసకుర్రు, ఇతర లంకలను కలుపుతూ పర్యాటక ప్యాకేజీని అమలు చేస్తారని, దీనికోసం అనువైన ప్రాంతాలను గుర్తించాలని తహసీల్దారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రెండవదిగా అఖండ గోదావరి సర్కూ్యట్‌ను కూడా అభివృద్ధి చేస్తామని, దీనికోసం ముఖ్యమంత్రి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. దీనిలో భాగంగా కోటిలింగాల నుంచి పుష్కరఘాట్‌ వరకు విస్తరణ పనులు చేపడతారని, పిచ్చుకలంక అభివృద్ధితో పాటు, హేవ్‌లాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారన్నారు. ధవళేశ్వరం నుంచి కడియం వరకూ ప్రత్యేక బోటు ప్రయాణం వంటి ప్రతిపాదనలు ఈ సర్కూ్యట్‌లో ఉన్నాయన్నారు. మూడో సర్కూ్యట్‌లో కాకినాడ బీచ్‌– కోరంగి అభయారణ్యం, వాటర్‌ సోర్సు వంటి పర్యాటక అభివృద్ధి పనులు ఉన్నాయని, నాలుగవ సర్కూ్యట్‌లో ఎకో ఎడ్వంచర్‌ టూరిజంలో భాగంగా మారేడుమిల్లి అటవీ ప్రకృతి అందాలు, జలపాతాలు వీక్షించే ప్రాంతాలను రూపొందిస్తున్నారన్నారు. ఏజెన్సీలోని భూపతిపాలెం రిజర్వాయర్‌లో ఉన్న ద్వీప ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, పాములేరు వద్ద జలక్రీడలు ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మోతుగూడెం జలపాతాలకు రహదారి నిర్మాణం చేపట్టాలని సూచించారు. మారేడుమిల్లిలోని బేంబో చికెన్‌ వంటి ఆహార పదార్థాలు విక్రయించేవారికి ఒకేచోట కామన్‌గా షాపులు ఉండేలా స్థలం కేటాయించాలని, దీని ద్వారా వారికి మార్కెటింగ్‌ పెరగడంతో పాటు రోడ్లపై రద్దీ తగ్గుతుందన్నారు. రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిపై రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖల అధికారులతో ఈనెల 21న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్‌కు సూచించారు. కోరంగి అభయారణ్యంలో స్థానిక మత్స్యకారుల సహకారంతో మెకనైజ్డ్‌ బోట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యాటక శాఖ ఆర్డీ భీమశంకర్,  వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌వో ప్రభాకరరావు, పర్యాటకశాఖ ఈఈ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా