‘దారీ’ తెన్నూ తెలియక...

12 Aug, 2016 23:25 IST|Sakshi
‘దారీ’ తెన్నూ తెలియక...
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
రోడ్ల విస్తరణ,  ట్రాఫిక్‌ మళ్లింపుపై సరైన అవగహన లేకపోవడంతో తొలి రోజున పుష్కర భక్తులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వన్‌టౌన్‌లో  కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి వచ్చే యాత్రికులను ఫ్లై  ఓవర్‌ కింద నుంచి కెనాల్‌ రోడ్డు వీఎంసీ కార్యాలయం మీదగా స్నాన ఘాట్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే ట్రాఫిక్‌ మళ్లింపుపై అవగహన లేకపోవడం, సరైన సూచిన బోర్డులను ఏ ర్పాటు చేయకపోవడంతో ఫ్లై ఓవర్‌ వద్ద యాత్రికులు తీవ్ర  ఇబ్బందులకు గురయ్యారు. మార్కెట్‌ వైపు నుంచి వచ్చే భక్తులు వీఎంసీ కార్యాలయం వైపు వెళ్లేందుకు అనుమతించకపోవడం, అటు వైపు నుంచి వచ్చే యాత్రికులు కాళేశ్వరరావు మార్కెట్‌కు వెళ్లేందుకు వీలు లేకపోయింది. యాత్రికుల రాకపోకలను నియంత్రిస్తూ పోలీసుశాఖ బ్యారికేట్స్‌ను ఏర్పాటు చేశారు. రోడ్డు దాటేందుకు అనుమతించాలని యాత్రికులు పలు మార్లు వేడుకున్నా వారు ఒప్పుకోకపోవడంతో చివరకు ఫ్లైఓవర్‌ గోడఎక్కి దూకేశారు. వృద్దు లు, చిన్నారులు, యువకులు అనే బేదం లేకుండా ప్రతి ఒక్కరు ఇలా గోడ దూకేశారు. ఎలావెళ్లాలో చెప్పే పోలీసులు, వాలంటీర్లు కూడా కరువయ్యా రు. 
 
>
మరిన్ని వార్తలు