పుష్కర వాహనాలతో నగరంలో ట్రాఫిక్ జామ్

18 Jul, 2015 07:48 IST|Sakshi
పుష్కర వాహనాలతో నగరంలో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ : గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తులతో నగరంలోని రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. దీంతో సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్నగర్ తదితర ప్రధాన ప్రాంతాలలో శనివారం ఉదయం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ - కరీంనగర్ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. వారంతం కావడంతో భక్తులు పుష్కరాలకు పోటెత్తుతుండటంతో వారి వాహనాలతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి.

అంతేకాకుండా నల్లగొండ-వరంగల్ జాతీయరహదారిపై యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం గ్రామం సమీపంలో రెండు లారీలు ఢీ కొనడంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు టోల్‌గేట్లు వాహనాల రాకపోకలతో కిక్కిరిశాయి. జాతీయరహాదారి-44పై డిచ్‌పల్లి టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో రాజమండ్రి-వైజాగ్, రాజమండ్రి- విజయవాడ రహదారిలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

>
మరిన్ని వార్తలు