బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలు

2 May, 2017 22:19 IST|Sakshi
బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలు

► నాడు పడవ ప్రయాణం..
►  గతంలో కాలినడక,ఎడ్లబండ్లే దిక్కు
► బలోపేతమవుతున్న ఇరు జిల్లాల  ప్రజా సంబంధాలు


ఖానాపూర్‌: నాడు పడవ ప్రయాణం.. ప్రస్తుతం బస్సు ద్వారా రాకపోకలు. ఖానాపూర్‌ మండలంలోని బాదన్‌కూర్తిలో 2009లో బ్రిడ్జి నిర్మా ణం చేపట్టి పూర్తవడంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. బాదన్‌కూర్తి గ్రామం మీదుగా అంతర్‌జిల్లా రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డుతో రెండు జిల్లాల (నిర్మల్, జగిత్యాల) ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఉంది. ఎక్కడైన వెళ్లాలంటే రోడ్డు మార్గాన ద్వారా వెళ్తున్నారు. దీం తో ఇరు జిల్లాల ప్రజాసంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంలో కాలినడకన, ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవారు. 8 ఏళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణం పూర్తవడంతో ఇరువైపులా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్, బాదన్‌కూర్తి గ్రామాల మీదుగా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్‌ మండలం ఒగులాపూర్‌కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి గతంలో ఉన్న ప్రధాన రోడ్డు ద్వారా మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్‌ ప్రాంతాలకు వెళ్లవచ్చు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఆయా గ్రామాల నుంచి ప్రతిరోజు బస్సులు వచ్చి వెళ్తున్నాయి. రెండు వైపులా జిల్లా సరిç ßæద్దు గ్రామాలు కావడంతో బంధుత్వాలు రెండు జిల్లాలో ఉన్నాయి. మండల కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్‌ కంటే దగ్గరగా  25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్‌పల్లి ప్రాంతానికి ఇటీవలకాలం అత్యధికంగా ఇక్కడి ప్రజలు ప్రయాణిస్తున్నారు.

పెరుగుతున్న వ్యాపార లావాదేవీలు
ఇరు జిల్లాలోని రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అటువైపు, ఇటువైపు మంచి మార్కెట్‌ కేంద్రాలు ఉన్నాయి. మెట్‌ పల్లి మార్కెట్‌కు చెందిన వ్యాపారులకు గతకొద్ది రోజులుగా ఖానాపూర్‌ మార్కెట్‌ యార్డులో పసుపు కొనుగోళ్లు చేపట్టారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్‌తోపాటు మంచి మార్కెట్‌ సౌకర్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం గతంలో రైతుల తమ పంట ఉత్పత్తులను ఎక్కడ గిట్టుబాటు ధరలు ఉంటే అక్క డ అమ్ముకోవచ్చని ఉన్న ఆంక్షలు ఎత్తేయడంతో గిట్టుబాటు ధర ఉన్న చోట అమ్ముకుంటున్నారు. 

అదేవిధంగా మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్‌పల్లికి వెళ్లి, ఆసుపత్రుల్లో చికిత్సలు సైతం చేయించుకుం టారు. ఖానాపూర్‌లో జరిగే వారసంతలో కూరగాయలు, బట్టలు మసాలా దినుసులను ఇతర వ్యాపార లావాదేవీలకు కోసం సమీప మండలాల్లోని  వ్యాపారులు, ప్రజలు అధికసంఖ్యలో వచ్చి అమ్మకాలు, కొనుగోలు చేపడతారు. ప్రç Ü్తుతం ఆయా జిల్లాలకు చెందిన డిపోల నుంచి సైతం ప్రతిరోజు బస్సులు నడుస్తున్నాయి.

నాడు అష్టకష్టాలు.. నేడు రాచమార్గం
గతంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గ్రామాలకు వెళ్లాలంటేనే ఎడ్లబండ్ల ద్వారా, కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. రవాణా మార్గం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరుజిల్లాల సరిహద్దు గ్రామాల్లో పిల్లలకు పెళ్లిల్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. దాంతో ఇరు జిల్లాల్లో బంధుత్వాలు ఎక్కువై ప్రజా సంబంధాలు బలపడుతున్నాయి. రవాణా సౌకర్యం మెరుగైన క్రమంలో మరిన్ని బస్సు ట్రిప్పులు ఆయా గ్రామాలకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు