మఠంపల్లి నరసింహక్షేత్రంలో గో ఘోష

3 Feb, 2016 13:40 IST|Sakshi
మఠంపల్లి నరసింహక్షేత్రంలో గో ఘోష

మఠంపల్లి: నిత్యం మత్రోఛ్ఛారణలు మారుమోగే ప్రఖ్యాత మఠంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహక్షేత్రంలో బుధవారం గో ఘోష వినిపించింది. క్షేత్రంలోని గో శాలలో జీవిస్తున్న గోవుల్లో 10 ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాయి. పరిస్థితి విషమించడంతో రెండు ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. వ్యర్థపదార్థాలు తినడంవల్లే ఆవులు చనిపోయాయని తెలిసింది.

మఠంపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహక్షేత్రంలో గల గోశాలలో 50 ఆవులు పెంచుతున్నారు. ప్రతిరోజూ గడ్డి మేపేందుకు వాటిని క్షేత్రం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళతారు. రోజూలాగే బుధవారం కూడా గడ్డిమేయడానికి అడవిలోకి వెళ్లిన ఆవుల్లో 10 గుర్తుతెలియని వ్యర్థపదార్థాలు తిని అనారోగ్యానికి గురయ్యాయి. విషయం తెలిసిన గోశాల నిర్వాహకులు పశువైద్యాధికారులను పిలిపించారు. అంతలోనే రెండు ఆవులు చనిపోగా, అనారోగ్యానికి గురైన మిగతా గోవులకు చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు