వికలాంగ యువతకు శిక్షణ

14 Sep, 2016 22:38 IST|Sakshi
ముకరంపుర: రాష్ట్రంలో తొలిసారిగా వికలాంగుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన డీడీయూజీకేవై పథకం ద్వారా వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌లో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ తెలిపారు. నిరుద్యోగ వికలాంగులకు ఈ కేంద్రంలో శిక్షణతో నైపుణ్యాలు పెంచి అనంతరం ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగావకాశాలు కల్పించనునన్నట్లు పేర్కొన్నారు. ట్యాలీ, డీటీపీ, డాటా ఎంట్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి చదివి ఉండి, 19 నుంచి 32 ఏళ్ల వయస్సున్న గ్రామీణ ప్రాంత వికలాంగులు, బదిరులు ఈ పథకానికి అర్హులన్నారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌తో పాటు మూడు నెలల పాటు వెయ్యి రూపాయల చొప్పున సై్టఫండ్‌ అందిస్తారని తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులైన వికలాంగులు 7893985858, 9440804858 నెంబర్లలో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. 
 
మరిన్ని వార్తలు