షార్జాలో పాల్గొనే మహిళ జట్టుకు శిక్షణ పూర్తి

25 Aug, 2016 21:27 IST|Sakshi
షార్జాలో పాల్గొనే మహిళ జట్టుకు శిక్షణ పూర్తి
 
గుంటూరు స్పోర్ట్స్‌ : విదేశీ మహిళ క్రికెట్‌ జట్లు ప్రాక్టీస్‌ చేసేందుకు  ఏసీఏ ఉమెన్స్‌ అకాడమీ చక్కటి వేదిక అని ఏసీఏ అకాడమీ ఉమెన్స్‌ వింగ్‌ చైర్మన్‌ జాగర్లమూడి మురళీమోహన్‌ అన్నారు. డిసెంబర్‌లో దుబాయిలో జరగనున్న గోల్ఫ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్, షార్జాలో జరగనున్న ఏషియా కప్‌ పోటీలలో షార్జా మహిళ క్రికెట్‌ జట్లు పాల్గొననుంది. అందులో భాగంగా ప్రాక్టీస్‌ చేసేందుకు షార్జా మహిళ జట్టు ఏసీఏ ఉమెన్స్‌ అకాడమికి విచ్చేసింది. ఈనెల 18 నుండి 25 తేదీ వరకు సాధనతో పాటు ఆంధ్ర మహిళ క్రికెట్‌ జట్టుతో ఐదు టీ–20 మ్యాచులు, రెండు 30 ఓవర్ల ఒన్‌డే క్రికెట్‌ ప్రాక్టిస్‌ మ్యాచ్‌లలో పాల్గొంది. గురువారం క్యాంప్‌ ముగింపు సందర్భంగా జేకేసీ కళాశాల ఆవరణలోని ఏసీఏ ఉమెన్స్‌ అకాడమీలో  షార్జా  జట్టుకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్జా మహిళ జట్టు సభ్యులకు జ్ఞాపికలు అందించారు. అనంతరం మురళీమోహన్‌ మాట్లాడుతూ గోల్ఫ్‌ కప్, ఏషియా కప్‌లో పాల్గొననున్న షార్జా జట్టుకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో చైనా జాతీయ మహిళా జట్టు, థాయ్‌ మహిళ క్రికెట్‌ జట్టు, ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ జట్లు అకాడమిలో సాధన చేశాయని తెలిపారు. అకాడమీ హెడ్‌ కోచ్‌ మారియా ఫాహె,కోచ్‌ ఎస్‌ శ్రీనివాసరెడ్డిలతో పాటు ఇతర సిబ్బంది షార్జా జట్టుకు పలు సూచనలు, సలహాలు అందించారని చెప్పారు. కార్యక్రమంలో షార్జా మహిళ జట్టు మేనేజర్‌ మన్వీ దోధీ,అసిస్టెంట్‌ కోచ్‌ సీ.కల్‌గుత్‌కర్, కెప్టెన్‌ హుమైరా తస్‌నీమ్,  ఏసీఏ ఉమెన్స్‌ అకాడమీ హెడ్‌ కోచ్‌ మారియా ఫాహె, కోచ్‌ ఎస్‌. శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్‌ కోచ్‌ డి.డేవిడ్, ట్రై నర్‌ కోటేశ్వరరావు, షార్జా, ఆంధ్ర మహిళ క్రికెట్‌ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు