మట్టి గణపయ్యా.. నీకు వందనమయ్యా...

1 Sep, 2016 19:31 IST|Sakshi
విద్యార్థులకు మట్టి వినాయకుల తయారీపై శిక్షణ
  • ఎర్రవల్లి పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ
  • జగదేవ్‌పూర్‌: రంగురంగుల గణపతి విగ్రహాల కన్నా మట్టి వినాయక విగ్రహాలే మేలని  మట్టి వినాయక ప్రతిమల నిర్వహణ సంస్థ నిర్వహకులు శ్రీనివాసాచారి అన్నారు. గురువారం మండలంలోని సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ముందుగా మట్టితో విగ్రహాలను ఎలా తయారు చేయాలి.. మట్టి వినాయకుల వల్ల లాభాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

    అలాగే మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసే విధానంపై అవగాహన కల్పించారు. రసాయనాలు, రంగులతో తయారు చేసే విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేస్తే నీరు కలుషితమవుతుందన్నారు. పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌, వీడీసీ గౌరవ అధ్యక్షుడు కృప్ణ, బాల్‌రాజులు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి శ్రీనివాసాచారిని శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వాతి, జ్యోతి, కుమార్‌, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు