‘కౌశల్య వికాస్‌యోజన’ కింద వివిధ కోర్సుల్లో శిక్షణ

22 May, 2017 22:22 IST|Sakshi

ఎస్కేయూ :

 ప్రధానమంత్రి కౌశల్య వికాస్‌ యోజన పథకం కింద వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్కేయూ సమీపంలోని ఆది ఫౌండేషన్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ఎం.ఆంజనేయులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. శిక్షణతోపాటు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. జూన్‌ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు  దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తివివరాలకు ఫోన్‌ : 08554–255433, 78423 26156, 91604 25798లో సంప్రదించాలన్నారు.

 

రంగం                     కోర్సుల వివరాలు             అర్హత

 

ఐటీ/ఐటీఈఎస్‌           డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌         పది ఉత్తీర్ణత

                           జూనియర్‌ సాప్ట్‌వేర్‌ డెవలపర్‌   బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం 

                                                           కంప్యూటర్స్, బీటెక్, ఎంసీఏ

 

 

ఎలక్ట్రానిక్స్‌                 ఫీల్డ్‌ టెక్నీషీయన్‌ కంప్యూటింగ్‌ అండ్‌                     ఇంటర్‌

                   ఫెరిఫరల్స్‌

                    ఫీల్డ్‌ టెక్నీషియన్‌ – నెట్‌వర్కింగ్‌ అండ్‌

                   స్టోరేజ్‌                                         డిప్లమో

                   సీసీటీవీ ఇన్సలేషన్‌ టెక్నీషియన్‌                 ఐటీఐ 

                   డీటీహెచ్‌ సెట్‌ఆఫ్‌ బాక్స్‌ ఇన్‌స్టలార్‌

                   అండ్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌                               పది ఉత్తీర్ణత

రిటైల్‌              సేల్స్‌ అసోసియేట్‌                              పది ఉత్తీర్ణత

బ్యాంకింగ్‌                 అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌–

                   అకౌంట్స్‌ పేయబుల్‌ అండ్‌ రిసీవబుల్‌          బీకాం

                   బిజినెస్‌ కరస్పాండెంట్‌                         పది ఉత్తీర్ణత 

మరిన్ని వార్తలు