యాజమాన్య పద్ధతులతో ‘పట్టు’

16 Sep, 2017 21:42 IST|Sakshi
యాజమాన్య పద్ధతులతో ‘పట్టు’

- ఫామ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ
- రాష్ట్రంలోని 13 జిల్లాల పట్టు పరిశ్రమ అధికారుల హాజరు

హిందూపురం: పట్టు పరిశ్రమలో ఆధునిక యాజమాన్య పద్ధతులు ఆచరించి, అధిక ఆదాయం పొందేవిధంగా రైతులను క్షేత్ర స్థాయిలో ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పట్టుపరిశోధన అభివృద్ధి సంస్థ సంచాలకులు డా. పి.జె రాజు పేర్కొన్నారు. శనివారం కిరికెరలోని పట్టుపరిశోధన కేంద్రంలో ఏపీఎస్‌ఎస్‌ఆర్డీఐ, మేనేజ్‌మెంట్‌ హైదారాబాద్‌ వారు సంయుక్తంగా ఫామ్‌ బిజినేస్‌ మేనేజ్‌మేంట్‌ ఫర్‌ సిరికల్చర్‌ సెక్టార్‌పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుపరిశ్రమలో మార్కెట్‌ ధరలను అవగాహన చేసుకొని రైతులకు మంచి యాజమాన్య పద్ధతులను అవలంభించే విధంగా తర్ఫీదు ఇచ్చి పట్టుపరిశ్రమ లాభదాయకంగా చేయాలన్నారు. కర్ణాటక హైదరాబాదు నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో అధికోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించారు. పంట సాగులో ఖర్చులు తగ్గించుకొని, అదిక దిగుబడుల కోసం ఆధునిక పద్ధతులు అవలంభించే విధంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్‌ సెరికల్చర్‌ బోర్డు బెంగళూరుకి చెందిన డా.కుమారసేన, మైసూరు యూనివర్శిటీ ప్రొఫెసర్‌ వెంకటేశ్వరకుమార్, చింతామణి అగ్రికల్చర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ విజయేంద్ర, ఫామ్‌మేనేజ్‌ డీడీ కరీం, డా. సీతారాములు, డా.గోయల్, డా.సతీష్, 13 జిల్లాల పట్టుశాఖ అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు