వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా రైళ్ల పునరుద్ధరణ

17 Nov, 2015 11:54 IST|Sakshi

రాజంపేట: భారీ వర్షాలతో రాయలసీమలోని పలు జంక్షన్ లలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను అధికారులు పునరుద్ధరించారు. నందలూరు-ఒంటిమిట్ల మధ్యలో దెబ్బతిన్న రైల్వేట్రాక్‌కు మరమ్మతులు పూర్తి కావడంతో వివిధ స్టేషన్లలో ఆగిపోయిన రైళ్లు బయలు దేరాయి. మంగళవారం ఉదయం మంటపం పల్లి వద్ద గౌహతి- చెన్నై ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విషయం విదితమే.

ఫలితంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఐదు గంటల అనంతరం కోరమాండల్, హరిప్రియ, ఎగ్మూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు బయలుదేరాయి. తిరుపతి - గుంతకల్లు మార్గంలోని సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో కూడా పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే శాఖ మరమ్మత్తులు చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించింది.
 

మరిన్ని వార్తలు