నేటి నుంచి ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

1 Aug, 2016 23:24 IST|Sakshi
తిమ్మాపూర్‌: రవాణాశాఖ సేవలన్నీ మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు కరీంనగర్‌ డీటీసీ వినోద్‌కుమార్‌ తెలిపారు. రవాణాశాఖలోని 57 సేవలకు సంబంధించి దరఖాస్తుదారులు మొదట ఆన్‌లైన్‌లో, మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకుని అక్కడే ఫీజులు చెల్లించాలని చెప్పారు. ఆ తరువాత పత్రాలను ఆర్టీఏ ఆఫీసుల్లో సమర్పించాలని సూచించారు. మంగళవారం నుంచి ఆర్టీఏ ఆఫీసులో సేవలకు సంబంధించి నేరుగా డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదని, అంతా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని పేర్కొన్నారు. దీనిని దరఖాస్తుదారులు గమనించి సహకరించాలని కోరారు. సేవలు అందించినందుకు మీ సేవా, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులకు రూ.35 ఫీజు చెల్లించాలని చెప్పారు. 
 
 
మరిన్ని వార్తలు