ఖజానా శాఖలో బదిలీలు

18 Jun, 2016 13:10 IST|Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ శాఖలో 13 మంది ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. 2014 నవంబర్, 2015 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు నిర్వహించగా, వివిధ కారణాలతో ఖజానా శాఖ ఉద్యోగులు బదిలీలకు దూరమయ్యారు. కేవలం జిల్లా స్థాయి అధికారులే బదిలీలకు పరమితమయ్యారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, షరఫ్, ఆఫీస్ సబార్టినేట్లకు బదిలీలు జరగలేదు.

ఈ శాఖలో ఐదేళ్లపాటు ఒకే చోట పనిచేసిన సిబ్బంది 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 20 శాతం మందికే బదిలీలు పరిమితం కావడంతో మిగతా సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అదనంగా బదిలీలకు అనుమతులు ఇవ్వాలంటూ డీడీ వనజారాణి రాష్ట్ర డైరక్టర్‌కు లేఖ రాశారు. అక్కడ నుంచి అనుమతులు రావాల్సింది.

జిల్లాలో జిల్లా ఖజానా కార్యాలయంతోపాటు 14 సబ్ ట్రెజరీలు ఉన్నాయి. ఈ సిబ్బందిలో ఇప్పటి వరకు 13 మందికి బదిలీలు జరిగాయి. వీరిలో ఆఫీస్ సబార్టినేటర్లు ఇద్దరు, జూనియర్ అకౌంటెంట్లు ఇద్దరు,  సీని యర్ అకౌంటెంట్లు ఆరుగురు, షరఫ్ కేడరులో ముగ్గురికి బదిలీలు చేశారు. కాగా గెజిటెడ్ కేడరులో సబ్ ట్రెజరీ ఆధికారులకు బదిలీలు జరగాల్సి ఉంది.

మరిన్ని వార్తలు