దేవదాయ భూములను స్వాధీనం చేసుకుంటాం

14 Aug, 2016 19:54 IST|Sakshi
దేవదాయ భూములను స్వాధీనం చేసుకుంటాం
 దేవాదాయ ధర్మదాయ గెజిటెడ్‌ అధికారి విజయరాజు
శ్రీకాకుళం(ఘంటసాల): 
అన్యాక్రాంతమైన∙దేవదాయ, ధర్మదాయశాఖల పరిధిలోని ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయాశాఖల అధికారి మేడిపల్లిల విజయరాజు తెలపారు. ఆదివారం ఆయన కృష్ణాపుష్కరాల సందర్భంగా శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయ భూములు 4.53 లక్షల ఎకరాలు ఉన్నాయని వాటిలో 80 వేల ఎకరాలు అక్రమణలకు గురైనట్లు తెలిపారు. అక్రమణలకు గురైన స్థలాల్లో ఉన్న వారికి దేవదాయ యాక్టు ప్రకారం నోటీసులు అందించి తిరిగి వాటిని స్వాదీనం చేసుకుంటామన్నారు. అనంతరం ఆయన్ను ఆలయాధికారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎండోమెంట్‌ అధికారులు సుధాకర్, సురేష్, విజయరాజులు ఉన్నారు.
 
 
మరిన్ని వార్తలు