గిరిజన అటానమస్‌ జిల్లా ఏర్పాటు చేయాలి

11 Sep, 2016 00:34 IST|Sakshi
  • ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ డిమాండ్‌
  • న్యూశాయంపేట : ఏటూరునాగారం కేంద్రంగా గిరిజన అటానమస్‌ జిల్లా ఏర్పాటు చేయాలని ఎంసీపీఐ(ఐక్య) జిల్లా కార్యదర్శి గాదగోని రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్‌ చారిత్రక నేపథ్యాన్ని విస్మరించి వరంగల్, హన్మకొండ జిల్లాలుగా విడదీయాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
     
    అటవీ చట్టాల ప్రకారం షెడ్యూల్‌ ప్రాం తాలను స్వయం పాలిత జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం నిర్దేశిస్తోందన్నారు. చట్టాలను తుంగలో తొక్కుతూ ఇటు భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల పేరుతో ఆదివాసీ గిరిజన జాతిని చీల్చుతస్తున్నారని తెలిపారు. ప్రతిపాదిత భూపాలపల్లి జిల్లాను రద్దు చేసి ఏటూరునాగారం కేంద్రంగా అటానమస్‌ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. జనగామను కూడా జిల్లా చేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు గోనె కుమారస్వామి, పరికరాల భూమయ్య, మంద రవి, ఎగ్గని మల్లికార్జున్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు