‘గిరి’ సంస్కృతి ప్రతిబింబించాలి

27 Aug, 2016 23:59 IST|Sakshi
  •  జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు 
  •  జోడేఘాట్‌ సందర్శన
  •  
    కెరమెరి : గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా పేయింటింగ్‌ వేయాలని  జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని అమర వీరుని గ్రామమైన జోడేఘాట్‌ను ఏపీవో జనరల్‌ నాగోరావుతో కలిసి సందర్శించారు. జోడేఘాట్‌లో కొనసాగుతున్న భీమ్‌ స్మారక పనులు పరిశీలించారు. మ్యూజియం, హంపీథియేటర్, స్మారక స్థూపం తదితర నిర్మాణాలను పరిశీలించారు.
              ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి కొద్ది రోజుల్లో జరిగే కొమరం భీమ్‌ వర్ధంతి లోపు జీవం ఉట్టి పడేలా పేయింటింగ్‌ వేయాలన్నారు. ఆయా గోడలపై గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆభరానాలు, ఆచార వ్యవహరాలు, క్లుప్తంగా కనిపించేలా పేయింటింగ్‌ ఉండాలన్నారు. టూరిజం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అశోక్, ఏఈ ఆంజనేయులు, ఐటీడీఏ ఏపీఆర్‌వో దశరథ్, కొమరం భీమ్‌ మనవడు సోనేరావు, కొమరం భీమ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. 
     
మరిన్ని వార్తలు