ట్రిబ్యునల్‌ తీర్పు బేఖాతర్‌

22 Oct, 2016 21:45 IST|Sakshi
ట్రిబ్యునల్‌ తీర్పు బేఖాతర్‌
స్థలం స్వాధీనంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం
- టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణం
- నోటీసులతో సరిపెట్టే ప్రయత్నం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చిన నాలుగేళ్ల తర్వాత దేవాదాయ శాఖ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణం కాగా.. ఆ శాఖ కమిషనర్‌ ఆగ్రహంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఇప్పుడు కూడా నోటీసులతో సరిపెట్టేందుకు రంగం సిద్ధమయింది.ఽ వివరాల్లోకి వెళితే.. కర్నూలు కిడ్స్‌ వరల్డ్‌ సమీపంలోని గోరక్షణ మహా సంఘానికి సర్వే నెంబర్‌ 171లో 330 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో వీఎస్‌ టెక్స్‌టైల్స్‌ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం 2012లో తీర్పు ఎండోమెంట్‌కు అనుకూలంగా వచ్చింది. తీర్పు కాపీ అందిన నెల రోజుల్లో స్థలం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అయితే దేవాదాయ శాఖ స్పందించని పరిస్థితి. ప్రస్తుతం అధికార టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఒత్తిళ్లతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. విషయం దేవాదాయ శాఖ కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ మేరకు తీర్పు వచ్చిన నాలుగేళ్ల తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ గాయత్రిదేవి కర్నూలు తహసీల్దార్‌ రమేష్‌, పోలీసు అధికారులతో శనివారం సర్వే నెంబర్‌ 171లోని స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. వీఎస్‌ టెక్స్‌టైల్స్‌ పేరుతో నిర్వహిస్తున్న దుకాణాన్ని ఖాళీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని యజమాని టీడీపీ నేతల దృష్టికి తీసుకెళ్లడం.. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం.. అక్కడి నుంచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే 15 రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని దుకాణం యజమానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా