టంగుటూరికి నివాళి

23 Aug, 2016 20:38 IST|Sakshi
టంగుటూరికి నివాళి
గుంటూరు వెస్ట్, గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతి వేడుకలు జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్, జెడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జానీమూన్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టంగుటూరిని తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. కార్యక్రమంలో అకౌంట్స్‌ అధికారి సీహెచ్‌.రవిచంద్రారెడ్డి, వివిధ విభాగాల పర్యవేక్షకులు కె.త్యాగరాజు, జాస్తి రామచంద్రరావు, బండి శ్రీనివాసరావు, ఎంఎస్‌ఆర్‌కే ప్రసాద్, కిశోర్, మహేష్, జె.శోభారాణి, ఎ.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
 
* గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన ఆంధ్రకేసరి జయంతి నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ జీవన ప్రస్థానంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని కార్యదీక్షతో విలువలు పాటించిన మహానీయునిగా టంగుటూరి ఘనకీర్తి పొందారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఇక్కుర్తి సాంబశివరావు, జేసీ ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు, డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు