త్రివిక్రమ్‌ పాలకొల్లు వచ్చారు

31 Jul, 2016 01:48 IST|Sakshi
 పాలకొల్లు సెంట్రల్‌ : ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ శుక్రవారం రాత్రి 11 గంటలకు పాలకొల్లులోని ఓ రెస్టారెంట్లో తళుక్కున మెరిశారు. పట్టణంలోని రైల్వే గేటు సెంటర్‌ వద్ద ‘మనం’ ఫేమ్‌ బొలిశెట్టి పవ¯Œæ (మనంలో చిన్నప్పటి అక్కినేని నాగేశ్వరరావుగా చేశాడు) తండ్రి చిన్నికి చెందిన ఇడ్లీ రెస్టారెంట్‌కు త్రివిక్రమ్‌ వచ్చారు. ఇటీవల హైదరాబాద్‌ వెళ్లినప్పుడు తన రెస్టారెంట్‌కు రావాలని త్రివిక్రమ్‌ను ఆహ్వానించినట్టు చిన్ని చెప్పారు. రెస్టారెంట్లో పవన్, చిన్నిలతో గంటసేపు త్రివిక్రమ్‌ ముచ్చటించారు.
 
 

 

మరిన్ని వార్తలు