‘ప్రగతి’లో సందడి

12 Apr, 2016 01:47 IST|Sakshi
‘ప్రగతి’లో సందడి

తొలిరోజు కొనసాగిన కార్పొరేటర్లకు శిక్షణ
కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తరలివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన జిల్లా నేతలు
ప్రజాప్రతినిధుల రాకతో కిక్కిరిసిన రోడ్లు
రహదారుల వెంట భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు

చేవెళ్ల: కార్పొరేటర్ల శిక్షణా తరగతులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నికైన టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఓరియెంటేషన్ వర్క్‌షాప్ శంకర్‌పల్లి మండలం పొద్దటూరు గ్రామ పరిసరాల్లోని ప్రగతి రిసార్ట్స్‌లో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు దారిపోడవునా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. కాగా రిసార్ట్స్‌లోకి మీడియాతో సహా స్థానికులెవరినీ అనుమతించకపోవడంతో రిసార్ట్స్ వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్), వరంగల్, రా మగుండం, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు నేటినుంచి ఈ కార్యక్రమాన్ని ఈ శిక్షణ , అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు.

గతంతో రెండుసార్లు ఇక్కడికి పలు అధికారిక కార్యక్రమాలకు రావాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో పర్యటనను రద్దుచేసుకున్న కేసీఆర్ ఎట్టకేలకు ముచ్చటగా మూడోసారి మాత్రం ప్రగతి రిసార్ట్స్‌కు వచ్చారు. సోమవారం ఉదయం 10.40 నిమిషాలకు ఆయన రిసార్ట్స్‌కు చేరుకున్నారు. 11 గంటలకు వేదికపైకి వచ్చి కార్పొరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు హాజరయ్యారు. హైదరాబాద్ అభివృద్ధికోసం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎమ్మెల్యేలకు సుమారుగా గంట కుపైగా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంపొందించే విధంగా ప్రజలను భాగస్వాములను చేసి నగరాన్ని సుందరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేయాలని కోరారు.

నగరంలో పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయని, అప్పుడే మనం ప్రజలకోసం ఏంచేయాలో పనులను చేపట్టవచ్చంటూ.. కార్యాచరణను ప్రకటించారు. బా గా పనిచేసే డివిజన్లకు ముఖ్యమంత్రి నిధుల నుంచి నిధులను కేటాయిస్తానంటూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పురపాలక శాఖామంత్రి కేటీఆర్, రవాణాశాఖా మం త్రి పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, నగర మేయర్ బొంతు రాంమ్మోహన్, డిప్యూటీ మేయర్ మాజిద్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

 భారీ బందోబస్తు..
ప్రగతి రిసార్ట్స్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా నగరం నుంచి దారి పొడవునా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గండిపేట, హిమాయత్‌సాగర్, చిలుకూరు మీదుగా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రగతి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఈ దారి పొడవునా సైబరాబాద్ పోలీసులతో జిల్లా పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  

 మీడియాకు నో ఎంట్రీ..
కార్పొరేటర్లకు పరిపాలన, అభివృద్ధిపై అవగాహన కల్పించడానికి సోమవారం నుంచి ఏర్పాటు చేసిన మూడురోజుల శిక్షణా కార్యక్రమానికి మీడియాను అనుమతించ లేదు. వికాఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మీడియాను లోపలికి అనుమతించబోమని రాబాద్ డీఎస్పీ స్వామి స్పష్టం చేశారు. కాగా సమావేశానికి అనుమతి కోసం విలేకరులు ప్రధాన గేటు వద్ద ఎండలో నిరీక్షించారు.

 

మరిన్ని వార్తలు