జానా కాగితం పులి మాత్రమే

26 Apr, 2017 16:54 IST|Sakshi
జానా కాగితం పులి మాత్రమే
నాగార్జునసాగర్ : సీఎల్‌పీ నేత, సీనియర్ శాసనసభ్యుడు కె జానారెడ్డిపై టీఆర్ఎస్ నాయకుడు నోముల నర్సింహయ్య విరుకుపడ్డారు. జానారెడ్డి ఒక కాగితం పులి లాంటి వారని విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జానారెడ్డి రైతుల కోసం ఏమీ చేయలేకపోయారని అన్నారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరుతడుల ద్వారా సాగర్‌ ఆయకట్టుకు రెండు పంటలకు నీరిచ్చి రైతులకు అండగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే సాధమయ్యేనా అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న జానారెడ్డి ఒక్కసారైనా ఎడమకాల్వపై పర్యటించారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ 16 వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్బంగా నిర్వహిస్తున్న వరంగల్‌ భహిరంగసభ చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు.
 
సంవత్సరానికి రెండు పంటలకు సంబంధించి 8 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అదే విధంగా యాదవులు, నాయీబ్రాహ్మణులు, గిరిజనులు, ముస్లింలు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సంతోషాన్ని వరంగల్‌ సభకు భారీగా రావడం ద్వారా వారు తెలుపనున్నారన్నారు. నియోజకవర్గంలో 57వేలకు పార్టీ సభ్యత్వాలు చేరాయని, చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా వరంగల్‌ బహిరంగ సభ పోస్టర్‌ను వారు విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కేవీ రామారావు, పగిల్ల సైదులు, అంకతి వెంకటరమణ, రాం అంజయ్యయాదవ్, బొల్లం శ్రీను, బొల్లం రవి, కావేటి రాము, మన్నెం రంజిత్‌ యాదవ్, పరమేష్, సుజయ్, కేశబోయిన జానయ్య, పిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా