స్థానిక ఉప పోరులో కారు జోరు

8 Sep, 2016 22:02 IST|Sakshi
  • నాలుగుచోట్ల గులాబీశ్రేణుల గెలుపు
  • సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా జరిగిన సర్పంచ్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జోరు కొనసాగించింది. ప్రధానంగా అందోల్‌ నియోజకవర్గంలో రెండుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. గురువారం జిల్లాలోని అందోల్‌ నియోజకవర్గంలోని మునిపల్లి మండలం చిన్నాషెల్మాడ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వసంత్‌పై టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి నరేశ్‌కుమార్‌ 97 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.

    అందోల్‌ మండలం కిచ్చన్నపల్లి సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వరూప కాంగ్రెస్‌ అభ్యర్థి అరుణపై 166 ఓట్లతో గెలిచారు. జహీరాబాద్‌ మండలం రంజోల్‌ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మాణమ్మపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జనాబాయి 838 అధిక్యంతో గెలుపొదారు. పస్తాపూర్‌ పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి గురునాథ్‌రెడ్డి, న్యాల్‌కల్‌ మండలం హద్నుర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, గజ్వేల్‌ మండలం జాలిగామ పంచాయతీలోని 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, దౌల్తాబాద్‌ మండలం కొత్తపల్లి సర్పంచ్‌గా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి మౌనిక గెలుపొంరు.

    10న ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
    పుల్‌కల్‌ మండలం కొడూర్, నారాయణఖేడ్‌ మండలం జగన్నథ్‌పూర్‌ ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. జగన్నథ్‌పూర్‌లో మొత్తం 1583 ఓట్లకు 1141 పోల్‌ అయ్యాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌ తరఫున మాణిక్యం, కాంగ్రెస్‌ అభ్యర్థిగా నర్సింలు, టీడీపీ అభ్యర్థిగా రాములు పోటీ చేస్తున్నారు.

    పుల్‌కల్‌ మండలం కొడూర్‌ ఎంపీటీసీ ఉప ఉన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నా చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థి టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. కొడూర్‌లో 698 ఓట్లకు 603, ఇసోజిపేటలో 751కి 661 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు ఈనెల 10వ తేదిన ఆయా మండల కేంద్రాల్లో జరుగుతాయని డీపీఓ సురేశ్‌బాబు తెలిపారు. ఈవీఎంలను పోలీసుల పర్యవేక్షణలో ఎంపీడీఓ కార్యయంలో భద్రపరిచామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు