పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

2 Jun, 2017 03:54 IST|Sakshi
పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

వేములవాడ ఎమ్మెల్యే  రమేశ్‌బాబు
మేడిపెల్లి: పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. గురువారం మండలంలోని గోవిందారం, మన్నెగూడెం, భీమారం, మేడిపెల్లి గ్రామాలలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే మిషన్‌ భగీరథ పథకం కింద మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. అలాగే మేడిపెల్లిలో సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను అందించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తామని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రకటించిందని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తున్నట్లు చెప్పారు. మండలానికి మొదటి దశలో 5 గ్రామాలను ఎంపిక చేసి 75 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. రెండవ దశలో కూడా నియోజకవర్గానికి 1000 ఇళ్లు వచ్చినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. మిషన్‌ భగీరథ కింద ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. కథలాపూర్‌ మండలం కలిగోటలో గల సూరమ్మ చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు రూ.195 కోట్లు మంజూరయినట్లు తెలిపారు.

మండలంలోని మన్నెగూడెం జెడ్పీఎస్‌ఎస్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్, సబ్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ఆలీ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ ముక్కెర గంగాధర్, పోరుమల్ల సింగిల్‌ విండో చైర్మన్‌ మిట్టపెల్లి భూమరెడ్డి, తహశీల్దార్‌ వెంకటేశ్, ఎంపీడీవో హరికిషన్, పీఆర్‌ఏఈ గోపాల్, ఏవో త్రివేదిక, సర్పంచ్‌లు తోకల నర్సయ్య, గౌరి భూమయ్య, ఉత్కం లక్ష్మి, వీరబత్తిని ఆంజనేయులు, ఎంపీటీసీలు బాలసాని రవిగౌడ్, కళ్ళెం భూమేశ్వరి, కుందారపు అన్నపూర్ణ, నాయకులు సుధవేని గంగాధర్‌గౌడ్, రవి, ఎండీ గాజీపాష, కుందారపు రవి, సాగర్, ప్రభాకర్, నారాయణరెడ్డి, భగవంతం,శంకర్, రాంరెడ్డి, గంగారాం, సురేశ్, చారీ, జలందర్‌రావు, రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు