ఆమోదయోగ్యమైన ధర చెల్లిస్తాం

22 Oct, 2016 18:49 IST|Sakshi
–ఆర్డీవో బి.శ్రీనివాసరావు వెల్లడి
కొవ్వూరు–గుండుగోలను జాతీయ రహదారి–16 ఆరులైన్ల విస్తరణలో భాగం సేకరించే భూములకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఆర్డీవో బి.శ్రీనివాసరావు స్వష్టం చేశారు.శనివారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో పట్టణ పరిధిలో భూములు కొల్పోయే రైతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా భూసేకరణలో భాగంగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జాతీయ రహదారుల భూసేకరణ చట్టం సెక్షన్‌ 3( సీ)  ప్రకారం రైతులను ఆర్డీవో అభ్యంతరా లు స్వీకరించారు.పురపాలక సంఘం పరిధిలో ఉన్న భూములకు వాణిజ్య పర ంగా విలువ అధికంగా ఉన్నందున అత్యధిక నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరారు.ప్రస్తుతం కొవ్వూరులో నడుస్తున్న «భూముల ధరలను పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించాలని రైతులు కోరారు.పోలాల్లో ఉన్న మురుగునీరు బయటికి వెళ్లడానికి అనువుగా ఉన్న కాలువలు, డ్రయిన్‌లు రోడ్డు నిర్మాణ సమయంలో పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అర్భన్‌ బ్యాంకు చైర్మన్‌ మద్దిపట్ల శివరామకష్ణ కోరారు.లేదంటే మిగిలిన రైతుల భూములన్నీ ముంపుబారిన పడే ప్రమాదం ఉందన్నారు. రైతులు పోలాలల్లోని పంటను బయటికి తీసుకెళ్లెందుకు అనువుగా తక్కువ దూరంలోనే సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయించాలని రైతులు కోరారు. నాయకులు ముదునూరి నాగరాజు,ముదునూరి సత్తిరాజు, గండ్రోతు కోదండరామారావు, పి.వెంకట సుబ్బరాజు, ఏ.నాగేశ్వరరావు, పి.సత్యనారాయణ రాజు, డి.సందీప్‌కుమార్, గోలి.శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు