పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

7 Sep, 2017 21:42 IST|Sakshi

అనంతపురం అర్బన్‌: జిల్లాలో పర్యటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి పేర్కొన్నారు. ఇందు కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 211.86 భూమి కేటాయించామన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి పర్యటక రంగ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి కోసం తాడిపత్రి మండలం  సజ్జలదిన్నె వద్ద 1.75 ఎకరాలు, లేపాక్షి జఠాయువు ప్రాజెక్టుకి 3.30 ఎకరాలు, లేపాక్షి యాంఫీ ధియేటర్‌ కోసం 2 ఎకరాలు, గుత్తిలో రోప్‌ వే కోసం 50 సెంట్లు కేటాయించామన్నారు.

పర్యాటక ప్రాజెక్టు కోసం  పెనుకొండలో 19.75 ఎకరాలు, తనకల్లు మండలం కోటిపల్లి వద్ద రూ.184.56 ఎకరాలు కేటాయించే భాగంలో అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం పర్యాటక రంగం పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పర్యటక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ గోపాల్‌, సంబంధిత విభాగం పర్యవేక్షకుడు వెంకటనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు