కార్మిక సంక్షేమానికి కృషి చేయాలి

4 Aug, 2016 20:17 IST|Sakshi

సిద్దిపేట జోన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం కృషి చేయాలని, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం శ్రామిక భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వద్ద నుంచి వసూలు చేస్తున్న సెస్‌ను వారి శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన కార్మికునికి వేతనం చెల్లించాలన్నారు.ఈఎస్‌ఐ , పీఎఫ్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు