విద్యార్థుల అభివృద్ధికి కృషి

11 Nov, 2016 23:44 IST|Sakshi
విద్యార్థుల అభివృద్ధికి కృషి
 
  • ఏపీ ప్రైవేట్‌ స్కూల్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు సుందరరావు
 
నరసరావుపేట రూరల్‌ : విద్యార్థుల మానసిక, సామాజిక అభివృద్ధికి ప్రైవేటు పాఠశాలలు తమ వంతు కృషిచేస్తున్నాయని ఏపీ ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అ««దl్యక్షుడు వి.సుందరరావు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలను కేవలం చదువు చెప్పే కర్మగారాలుగా భావించవద్దని కోరారు. కోటప్పకొండలోని లివింగ్‌ హోప్‌ పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి ప్రైవేటు పాఠశాలల ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. లివింగ్‌ హోప్‌ పాఠశాల డైరక్టర్‌ బి.సుశీల్‌కుమార్‌ అ««దl్యక్షతన జరిగిన పోటీల ప్రారంభ కార్యక్రమంలో సుందరరావు మాట్లాడారు.  క్రీడాస్ఫూర్తితో ఉన్నత లక్ష్యాల వైపు దూసుకుపోవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్‌ కృష్ణా జిల్లా అద్యక్షుడు మోహనరావు మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడల వైపు ఆసక్తి చూపకపోతే జీవితంలో సమస్యలను ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అసోసియేషన్‌ జిల్లా అ««దl్యక్షుడు కొల్లి బ్రహ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి శ్రీహారి, కోశాధికారి మల్లిఖార్జునరావు, ప్రధాన కార్యదర్శి చిరుమామిళ్ల రాము, ప్రిన్సిపాల్‌ సంఘమిత్ర, స్పోర్ట్స్‌ కన్వీనర్‌ ఎస్‌ఎమ్‌ సుభాని తదితరులున్నారు.
 
మరిన్ని వార్తలు