తెయూ హాస్టళ్లలో సమస్యలు లేకుండా చూడాలి

16 Jul, 2016 19:35 IST|Sakshi
తెయూ హాస్టళ్లలో సమస్యలు లేకుండా చూడాలి

డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో గల బాలుర, బాలికల వసతి గృహాలపై ప్రిన్సిపాల్ కనకయ్య వార్డెన్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ రికార్డులు, దరఖాస్తు ఫారాలు, అడ్మిషన్లు ఫీజులు, డిపాజిట్స్ తదితర విషయాలను పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాగే త్వరలో ప్రారంభం కానున్న నూతన హాస్టల్ భవనంతో సహా అన్ని వసతి గృహాలను శుభ్రం చేసి ఉంచాలని ఆదేశించారు. అలాగే యూజీసీ నుంచి ప్రత్యేకంగా బాలికల కోసం వసతి గృహాల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. గత సంవత్సరంలో లోటు బడ్జెట్ ఏదైనా ఉంటే దానికి గల కారణాలు కనుగొని, సమస్య పరిష్కారం కోసం వసతి గృహ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి, వార్డెన్లు మహేందర్‌రెడ్డి, సంపత్, రాంబాబు, కేర్‌టేకర్స్, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ప్రవీణాబాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు