శ్రీమఠం పీఠాధిపతి తులాభారం

22 Jul, 2017 23:14 IST|Sakshi
శ్రీమఠం పీఠాధిపతి తులాభారం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులకు తులాభారం వేడుక వైభవంగా జరిగింది. శ్రీమఠంలో శనివారం రాత్రి 9గంటలకు బెంగళూరు నగరానికి చెందిన అలసురమ్మ కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫలాలు, ధాన్యంతో పీఠాధిపతిని తూగించారు. రాయరు అనుగ్రహ సందేశంతో పాటు ఫలపూల మంత్రాక్షితలతో పీఠాధిపతి ఆశీర్వదించారు. వేడుకల్లో ఏఏఓ మాధవశేట్టి, మేనేజరు శ్రీనివాసరావు, ద్వారపాలక అనంతస్వామి  పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు