ఇలా వచ్చి.. అలా వెళ్లారు

2 Nov, 2016 02:57 IST|Sakshi
ఇలా వచ్చి.. అలా వెళ్లారు

బోనకల్ మండలంలో మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల పర్యటన
కేవలం ఇద్దరే డెంగీతో మృతి చెందారంటూ ప్రకటన
వైద్య శిబిరాల్లోనే జ్వర పీడితులకు పరామర్శ గంటలోనే ముగిసిన పర్యటన..
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ‘రావినూతల’ మృతుల కుటుంబాలు

 సాక్షి, ఖమ్మం/బోనకల్:  మూడు నెలలుగా బోనకల్ మండల పరిధిలోని అన్ని గ్రామాలు విషజ్వరాలతో మూలుగుతున్నారుు. ఇప్పటికే 350కి పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యారుు. ఇవి దేశంలోనే రికార్డు స్థారుు అని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులే ప్రకటించారు. మొత్తంగా 23 మంది జ్వరాల కారణంగా  మృతి చెందారు. అరుుతే ఈ మండలంలో డెంగీతో మృతి చెందింది ఇద్దరేనని, అదీ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిన వారేనని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. మంగళవారం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గోవిందాపురం, రావినూతల, బోనకల్‌లో పర్యటించారు. రావినూతలలో తొమ్మిదిమంది మృతి చెందినా.. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇందులో ఒక్కటి కూడా డెంగీ మరణం లేదా..? అని గ్రామస్తులు మండిపడుతున్నారు. మంత్రుల పర్యటన గంటలోపే ముగియడం, ఇలా వచ్చి.. అలా వెళ్లారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారుు. మధ్యాహ్నం 3.30 గంటలనుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మండలంలో మంత్రుల పర్యటన సాగింది. గోవిందాపురం (ఎల్) గ్రామపంచాయతీ కార్యాలయం, సాక్షరభారత్ కేంద్రాల్లో కొనసాగుతున్న వైద్యశిబిరాలను వారు పరిశీలించారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవల గురించి జ్వరపీడితులను అడిగి తెలుసుకున్నారు. గోవిందాపురంలో ఏసుపోగు తిరుపతమ్మకు డెంగీ జ్వరం రావడంతో ఆమెను మంత్రులు పరామర్శించారు. ఏమీ అధైర్యపడాల్సిన పనిలేదని, మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

గ్రామపంచాయతీ, సాక్షరభారత్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాలు సక్రమంగా లేవని, వసతులలేమి ఉందని, తక్షణమే విశాలంగా ఉన్న భవనంలోకి వైద్యశిబిరాన్ని మార్చాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావును ఆదేశించారు. అనంతరం గ్రామంలో డెంగీతో మృతిచెందిన ఏసుపోగు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను మంత్రులు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ముందుగా ఆయన చిత్రపటానికి  పూలువేసి నివాళులర్పించారు. ఏసుపోగు వెంకటేశ్వర్లు భార్య కుమారిని, కుమార్తె ప్రియాంకతో మాట్లాడారు. ఎక్కడ వైద్యం చేరుుంచారు. ఎంత ఖర్చు అరుుందని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేరుుంచుకుంటే మంచిగా ఉండేదికదా అన్నారు. ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో భారమంతా నాపై పడిందని ఏసుపోగు వెంకటేశ్వర్లు భార్య కుమారి మంత్రుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. పాప చదువు బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రులు హామీ ఇచ్చారు.

 రావినూతలలో వైద్య శిబిరాల్లోనే పరామర్శ..
రావినూతల  గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. సరైన వసతులు కల్పించాలని గ్రామప్రజలు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. జ్వరాలు తగ్గేవరకు గ్రామంలో వైద్యశిబిరాలు కొనసాగిస్తామని జిల్లా, రాష్ట్ర వైద్యబృందం గ్రామంలో వైద్యసేవలు అందిస్తుందని తెలిపారు. పంచాయతీ కార్యాలయం సరిపడకపోతే అవసరమైతే పాఠశాలలకు నాలుగురోజులు సెలవులిచ్చి అరుునా పాఠశాల భవనాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, ప్రభుత్వపరంగా కావాల్సిన అన్ని సదుపాయాలు అందజేస్తామన్నారు.

గ్రామాల్లో   డెంగీ, ప్లేట్‌లెట్స్ పరీక్షలకోసం అధునాతన పరికరాలు పంపించి పేద ప్రజలందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మండలంలో రెండు మూడు గ్రామాల్లోని పరిస్థితి ఎందుకు తీవ్రంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. గ్రామ సర్పంచ్ షేక్ వజీర్, తమ గ్రామంలో డెంగీ జ్వరాలతో ప్రతిరోజూ ప్రజలు మరణిస్తున్నారని, పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి నిధులు లేవని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన వారు గ్రామపంచాయతీలకు పారిశుద్ధ్య పనులకోసం ఎన్ని డబ్బులనైనా కేటారుుంచాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

గ్రామాల్లో వైద్యశిబిరాల ఏర్పాటుకు కలెక్టర్, మంత్రిని అడగాల్సిన అవసరం లేదని, వైద్యసిబ్బందే బాధ్యత తీసుకొని మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అరుుతే రావినూతలలో మంత్రుల పర్యటనకు ఐదు గంటల ముందే కొంకణాల రాములు (45) డెంగీతో మృతిచెందాడు. ఈ కుటుంబాన్ని అరుునా మంత్రులు పరామర్శిస్తారని గ్రామస్తులు భావించారు. కానీ గ్రామంలో తొమ్మిదిమంది మృతిచెందినా ఒక్క కుటుంబాన్ని పరామర్శించకపోవడం గమనార్హం.  అనంతరం బోనకల్ పీహెచ్‌సీ చేరుకొని అక్కడ జ్వరంతో చికిత్స పొందుతున్న వారిని వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 

అంతా పోలీస్ పహారాలోనే... 
బాధిత కుటుంబాలు, జ్వరపీడితులు మంత్రులకు తమ గోడును విన్నవించుకునేందుకు కూడా వీలులేకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య పర్యటన సాగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరపీడితులకంటే పోలీస్ సిబ్బందే ఎక్కువగా ఉండటంతో కనీసం ప్రజలు మంత్రులతో మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోరుుంది. రోప్ మధ్యలో ఉంటూ మంత్రులు వైద్య శిబిరంలో జ్వరపీడితులను పరామర్శించారు.  ప్రభుత్వం అన్నిరకాల వైద్యసేవలు అందిస్తుంది అనేవిధంగానే మంత్రుల పర్యటన కొనసాగింది.   ఈ పర్యటనలో  కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డెరైక్టర్ లలిత కుమారి, అదనపు డెరైక్టర్‌లు శంకర్, ప్రభావతి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, స్టేట్ కన్సల్టెంట్ సంజీవరెడ్డి, డీఎంహెచ్‌వో కొండలరావు, డీఎంవో రాంబాబు, డీపీవో కె.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు