కుటుంబ సాంప్రదాయంగా నేత్రదానం

28 Aug, 2016 00:23 IST|Sakshi
కుటుంబ సాంప్రదాయంగా నేత్రదానం
 
 నెల్లూరు(అర్బన్‌): 
కుటుంబ సాంప్రదాయంగా నేత్రదానాన్ని మారుద్దామని జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ మంజుల అన్నారు. నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని శనివారం స్థానిక కరంటాఫీసు సెంటర్‌లోని వెంకటేశ్వర ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా మంజుల మాట్లాడారు. తాను మరణించినా మరో ఇద్దరి అంధులకు దృష్టి దానం చేసే మహత్తర పుణ్య కార్యక్రమం నేత్రదానమన్నారు. మన పక్కనుండే శ్రీలంక దేశస్థులు విరివిగా నేత్రదానం చేస్తూ ప్రపంచంలో ముందు వరసలో ఉన్నారన్నారు. శ్రీలంక నుంచే ఎక్కువగా  విదేశాలకు నేత్రాలకు చెందిన కార్నియాలు అందుతున్నాయన్నారు. అదే స్ఫూర్తితో భారత్‌లో కూడా ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి అంధులకు వెలుగులు ప్రసాదించాలని  కోరారు. అనంతరం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నేత్రాదానానికి సంబంధించిన వివరాలన్నింటిని ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు