ఇద్దరి దుర్మరణం

30 Oct, 2016 00:13 IST|Sakshi
ఇద్దరి దుర్మరణం

= ఐచర్, బొలెరో ఢీ
= మూగజీవాలను తప్పించబోయి ప్రమాదం

ముదిగుబ్బ/తనకల్లు : ముదిగుబ్బ మండలంలో ఘోర రోడ్డు ప్ర మాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న మూగ జీవాల ను తప్పించబోయి రెండు నిండు ప్రాణాలు బల య్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ  ఘటన మండలకేంద్రంలోని ఎన్‌ఎస్‌పీ కొట్టాల జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటు చే సుకుంది. వివరాలు.. తనకల్లు మండలం చీకటిమానుపల్లి నుంచి ఐచర్‌ వాహనంలో చిత్తూరు జిల్లా  పీలేరుకు వెళ్లి బ్రాయిలర్‌ కోళ్లను ముదిగుబ్బకు సరఫ రా చేసేందుకు గొల్ల జగదీష్‌(21),  కొండకమర్ల  బాబాజీ(30) సహా ఐదుగురు బయలు దేరారు. వా హనం ఉదయాన్నే ఎన్‌ఎస్‌పీ కొట్టాల వద్దకు వేగం గా వచ్చింది. రహదారిపై అదే గ్రామానికి చెందిన ఆదెప్ప అనే వ్యక్తి పశువులు సమూహం (గుర్రాలు, కుక్కలు) రోడ్డు దాటించేందుకు వెళ్తున్నాడు.

ఈక్రమంలో పశువుల సమూహాన్ని సకాలంలో గుర్తించ ని ఐచర్‌ డ్రైవర్‌ ఉన్నఫలంగా వాటిని తప్పించేం దుకు యత్నించాడు. దీంతో వాహనం అదుపుతప్పి పశువులతో పాటు ఎదురుగా వస్తున్న బొలెరో వా హనాన్ని ఢీ కొట్టాడు. దీంతో ఐచర్‌ వాహనం బోల్తా కొట్టింది. ఐచర్‌లో ఉన్న జగదీష్, బాబాజీ అక్కడికక్కడే మృతి చెందారు. బొలేరో డ్రైవర్‌ నాగరాజు, ఐచర్‌లో ప్రయాణిస్తున్న గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఐచర్‌లో వందల సంఖ్యలో ఉన్న కోళ్లు, రోడ్డుపై ఉన్న ఒక గుర్రం, 3 కుక్కలు మృతి చెందాయి. సమాచారం తెలిసిన నల్లమాడ సీఐ శివరాముడు, ఎస్‌ఐ జయానాయక్, ఏఎస్‌ఐ విజయభాస్కర్‌రాజు క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయడపడిన గణేష్, నాగరాజు ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి చీకటిమానుపల్లికి వెళ్లి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు