పిడుగుపాటుతో ఇద్దరు మృతి

8 May, 2017 00:27 IST|Sakshi
మద్దికెర/కొలిమిగుండ్ల(పత్తికొండ, బనగానపల్లె): పిడుగుపాటుతో కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల ఆదివారం.. ఇద్దరు యువకులు మృతి చెందారు.మద్దికెర గ్రామానికి చెందిన విష్ణు (18).. పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడి మృత్యువాత పడ్డాడు. అలాగే కొలిమిగుండ్లకు చెందిన చంద్రశేఖర్‌(20)..దుస్తులు ఉతికేందుకు వెళ్లి  పిడుగుపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇతనికి వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ​ప్రొద్దుటూరుకు చెందిన యువతితో జూన్‌ 4వతేదీన వివాహం జరగాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఊహించని రీతిలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు