ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

12 Aug, 2016 00:33 IST|Sakshi
  • రూ.2.23 లక్షల బంగారం స్వాధీనం
  • వరంగల్‌ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఇద్ద రు నిందితులను సిటీ సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.2.23 లక్షల విలువ చేసే 82.250 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నింది తుల వివరాలను సీసీఎస్‌ సీఐ శ్రీధర్‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్‌ ఇమ్రాన్, మహారాష్ట్ర హింగన్‌ఘాట్‌ గోమాజీగూడకు చెందిన సయ్యద్‌ అక్బర్‌ దగ్గరి బంధువులు కావడంతో వంట పను లు చేసుకుంటూ విజయవాడలో జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన ఇద్దరు 2013లో మొదటిసారి దొంగతనానికి పాల్పడ్డారు. మళ్లీ 2015లో ఖమ్మం టూటౌన్‌ పరిధిలో దొంగతనానికి పాల్పడడంతో పోలీసులకు చిక్కడంతో షేక్‌ఇమ్రాన్‌ జైలు పాలయ్యాడు. ఈ ఏడాది జైలు నుంచి విడుదలైన ఇమ్రాన్‌ మళ్లీ అక్బర్‌తో కలసి వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. జనవరిలో హైదరాబాద్‌కు వెళుతు న్న మహిళ నుంచి 55 గ్రాముల బంగారు నగలు, జులైలో వర్ధన్నపేట మండలం కక్కిరాలపల్లిలో తాళం వేసిన ఇంటి నుం చి 27.250 గ్రాముల బంగారం దొం గిలించారు. చోరీ చేసిన ఆభరణాలను ఆమ్మేందుకు విజయవాడ నుంచి ఇద్దరు వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పక్కా సమాచారంతో క్రైం ఏసీపీ ఈశ్వర్‌రావు ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్టు చేసినట్లు సీఐ శ్రీధర్‌ వెల్లడించారు. వారిని అరెస్ట్‌ చేసిన సీఐతోపాటు ఎస్సై సుమన్, ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మున్నా, రవికుమార్, జంపయ్యను సీపీ సుధీర్‌బాబు అభినందించారు.  
మరిన్ని వార్తలు