వన్యప్రాణిని చంపిన కేసులో ఇద్దరి అరెస్టు

13 Aug, 2016 00:45 IST|Sakshi
అటవీశాఖ అధికారులు అరెస్టు చేసిన నిందితులు
 
– చిరుత పులిని చంపారంటున్న అటవీశాఖ అధికారులు
– కాదు చనిపోయింది అడవినక్క అంటున్న నిందితులు
– ఎముకలు, పుర్రెను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపిన అధికారులు
భాకరాపేట : ఎర్రావారిపాళెం మండలంలో వన్యప్రాణిని చంపిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్‌ రఘునాథ్‌ తెలిపారు. శుక్రవారం భాకరాపేట ఫారెస్టు కార్యాలయంలో రేంజర్‌ విలేకరులకు వివరాలు తెలిపారు. 42 రోజుల క్రితం   మండలంలోని వలసపల్లెకు చెందిన జి.రవుణారెడ్డి, బి.చెంగల్‌రాయులు చిరుతను ఉచ్చువేసి చంపినట్లు తమకు సవూచారం అందిందన్నారు. అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారనీ,  రెండురోజుల క్రితం వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఉచ్చులో పడి మృతి చెందింది అడవి నక్క అని తెలిపారన్నారు. వలసపల్లె అటవీ సరిహద్దు ప్రాంతంలోని వాగులో పూడ్చిపెట్టిన కళే» రాన్ని నిందితులు చూపించారన్నారు. కళేబరం కుళ్లిపోయి ఉండడం వల్ల ఎవుుకలు, పుర్రెను హైదరాబాద్‌ ల్యాబ్కు పంపినట్టు రేంజర్‌ వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై వన్య ప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేసి పీలేరు కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. 
 
 
 
మరిన్ని వార్తలు