అత్తింటి వారే చంపేశారు..!

22 Jul, 2016 12:09 IST|Sakshi
 బాధిత కుటుంబసభ్యులు, బంధువుల ఆరోపణ
 జిల్లాలో ఇద్దరు వివాహితల అనుమానాస్పద మృతి
 
మూడు‘ముళ్ల’ బంధం.. వారిని అనుబంధాలకు దూరం చేసింది. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన అత్తావారి ఇల్లే నరకప్రాయంగా మారింది. కట్నం వేధింపులో.. కుటుంబ గొడవలో.. కారణమేదైతేనేం చివరికి ఇద్దరి వివాహితల ప్రాణాలు బలిగొంది. హత్యో.. ఆత్మహత్యో.. కూడా తెలియని అనుమానాస్పద స్థితిలో మృత్యువు వారిని కబళించింది.  ఆదిలాబాద్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల ఈ హృదయ విదారక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
 
 వేమనపల్లి మండలంలో ఒకరు..
వేమనపల్లి : మండలంలోని మారుమూల ముల్కలపేట గ్రామంలో బొల్లంపల్లి స్రవంతి(21) అనే వివాహిత గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె భర్త పోచాగౌడ్ స్రవంతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుందని తెలుపుతుండగా... తండ్రి రాజమల్లాగౌడ్ మాత్రం తన కూతురును అత్తింటి వారే కొట్టి చంపారని ఫిర్యాదు చేశాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
 
కొట్టి చంపారంటున్న మృతురాలి కుటుంబసభ్యులు
ముల్కలపేటకు చెందిన బొల్లంపల్లి పోచాగౌడ్‌కు కోటపల్లి మండలం రాజారంకు చెందిన స్రవంతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. పోచాగౌడ్ త ండ్రి గతంలో చనిపోగా తల్లి బాయక్క ఉంది. వీరికి అప్పుడప్పుడు కుటుంబంలో స్వల్పంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లి బాయక్క కొడుకుతో ఉండలేక నాలుగు నెలల క్రితం వేరు కాపురం పెట్టించింది. గురువారం ఉదయం ఇంట్లో స్వల్ప గొడవ జరిగింది. పోచాగౌడ్ పొలం పనులకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య స్రవంతి అపస్మారక స్థితిలో మంచంపై పడుకుని ఉంది. వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో చెన్నూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కోటపల్లి చేరేసరికి మృతిచెందింది. కానీ.. మృతురాలి కుటుంబసభ్యుల వాదన మరోలా ఉంది. తన కూతురును అల్లుడు పోచాగౌడ్ అతని తల్లి బాయక్క కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. తండ్రి రాజమల్లాగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
 
ఇచ్చోడ మండలంలో మరొకరు..
ఇచ్చోడ : మండలంలోని గుండివాగు గ్రామంలో లక్కె సులోచన(25) అనే వివాహిత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో బావిలో మృతిచెందింది. అదనపు వరకట్నం కోసం తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సులోచన బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
 
అదనపు కట్నం కోసమే..?
ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామానికి చెందిన భగ్నూరె తాతెరావు తన కూతురు సులోచోనను మూడేళ్ల కిత్రం గుండివాగు వాసి లక్కె సూర్యకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. పెళ్లి సమయంలో రూ.లక్షన్నర వరకట్నంగా ఇచ్చాడు. అరుుతే రెండేళ్లుగా సూర్యకాంత్ అదనపు వరకట్నం కోసం సులోచనను వేధిస్తున్నాడు. కట్నం విషయంలోనే బుధవారం ఉదయం సులోచనతో అత్తింటివారు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మధ్యాహ్నం తన కూతురును పొలంలోకి తీసుకెళ్లి హత్య చేసి బావిలో పడేసి, ఇంటికి తిరిగొచ్చి తన భార్య కనిపించడం లేదని అల్లుడు సూర్యకాంత్ నాటకమాడాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. రాత్రంతా వెతికినట్లు చేసి బావిలో మృత దేహంగా ఉన్నట్లు గుర్తించి కట్టుకథ అల్లుతున్నారని రోదించారు. ఈ మేరకు గురువారం ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బోథ్ సీఐ నాగేంద్రచారి, నేరడిగొండ ఎస్సై వెంకన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బావిలోంచి మృతదేహాన్ని వెలికి తీరుుంచారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలి భర్త సూర్యకాంత్, అత్త శకుంతలను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మృతురాలికి 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
మరిన్ని వార్తలు