తుని కళాశాలను పరిశీలించిన యూజీసీ బృందం

30 Dec, 2016 00:08 IST|Sakshi
తుని రూరల్‌ : 
స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అభ్యర్థన మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ బృందం సభ్యులు గురువారం వివిధ విభాగాలను పరిశీలించి, విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. బృందం చైర్మ¯ŒS ప్రొఫెసర్‌ కులదీప్‌ దింస్సా, సభ్యులు డాక్టర్‌ వినోద్‌ సేథి, డాక్టర్‌ కె.సెల్వరాజ్, యూజీసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.సామ్రాజ్య లక్ష్మి, రాష్ట్ర ప్రతినిధి (ఆర్‌జేడీ) డాక్టర్‌ కె.గంగేశ్వరరావు, అక్నూ డీ¯ŒS డాక్టర్‌ వై.శ్రీనివాసరావు రెండు రోజుల పర్యటనకు కళాశాలకు వచ్చారు. ఉదయం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.సి.రవిచంద్రకుమార్‌తో సమావేశమైన బృందం రికార్డులు, క్యాంటీన్, తరగతి గదులు, ఇతర వసతులను పరిశీలించారు మధ్యాహ్నం విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వసతులు, తాగునీరు, అధ్యాపకులు, సిబ్బంది కొరతను ఏవిధంగా ఎదుర్కొంటున్నారని  ప్రశ్నించారు. ఫలితాలు, ఈ ప్రాంత అవసరాలను గుర్తించి స్వయం ప్రతిపత్తి (అటానమస్‌)కు అనుకూలంగా స్పందించాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరారు. వసతులు, తాగునీటి కల్పన, క్యాంటీ¯ŒS నిర్వహణకు పూర్తి బాధ్యత తీసుకుంటామని పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులైన మర్చంట్స్‌ అసోసియేష¯ŒS అధ్యక్షుడు కలిదిండి సత్యనారాయణరాజు, తాండవ సుగర్స్‌ చైర్మ¯ŒS సుర్ల లోవరాజు, ఎ¯ŒSహెచ్‌బీ డైరెక్టర్‌ చోడ్రాజు సత్య కృష్ణంరాజు, లయ¯Œ్సక్లబ్‌ అధ్యక్షుడు చిరంజీవి తదితరులు రూ.65వేలు చందాలు ప్రకటించారు. 
 
మరిన్ని వార్తలు