నేటి నుంచి అండర్‌–19 హాకీ పోటీలు

14 Oct, 2016 23:03 IST|Sakshi

– అనంత వేదికగా బాల,నేటి నుంచి అండర్‌–19 హాకీ పోటీలు
– బాలికల రాష్ట్రస్థాయి టోర్నీ


అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : 62వ రాష్ట్రస్థాయి అండర్‌–19 హాకీ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఆర్ట్స్‌ కళాశాల మైదానం, కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 17వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, జాయింట్‌ కలెక్టర్‌–2 ఖాజామోహిద్దీన్, ఆర్జేడీ వెంకటరమణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ టోర్నీలో 11 జిల్లాల బాలుర, 6 జిల్లాల బాలికల జట్లు పాల్గొంటాయన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు