నీట మునిగిన పంటలు

25 Jul, 2016 20:41 IST|Sakshi
నీట మునిగిన పంటలు

 రామాయంపేట:మండలంలోని కాట్రియాల, దంతేపల్లి గ్రామాల పరిధిలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో రెండు గ్రామాల్లో చెరువులు నిండిపోగా, కొన్ని చెరువులు అలుగు పారుతున్నాయి. భారీ వర్షంతో సుమారుగా 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతినడంతో చేలల్లో మట్టి మేట వేసింది. కాట్రియాల జైత్య కుంట నీటితో నిండి కళకళలాడుతుంది. చెరువును ఆనుకుని ఉన్న లంబాడి  కంలియాకు చెందిన మొక్కజొన్న చేను కొంతమేర నీటిలో మునిగింది.  దంతేపల్లినాయకమ్మ కుంట నిండిపోయింది.

ఈ చెరువు అలుగు పారుతోంది. చెరువుల కిందగల చెరకు, మొక్కజొన్న పంటల్లో నీరు నిలిచింది. మొక్నజొన్న పంట వేసిన భూమిలో మట్టి మేట వేసింది. తీన్‌ నంబర్‌ తండాలోని ఓ రైతు వ్యవసాయ భూమిలో భూమి కోతకు గురై గండి పడింది. నీటిపారుదలశాఖ ఏఈ శ్యాం, వీఆర్వో  ప్రణయిక నిండిన చెరువులతోపాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని  రైతులు విజ్ఞప్తి చేశారు.
 

 

మరిన్ని వార్తలు