"నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే'

22 Nov, 2016 00:42 IST|Sakshi

కళ్యాణదుర్గం రూరల్‌: 

నిరుద్యోగులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపర శురాం విమర్శించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్లు దండుకునేందుకు రూ.2 వేల భృతి  ఇస్తామని చంద్రబా బు అసత్య ప్రకటనలు చేశారన్నా రు. ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి అమలు చేయాలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్షావలీ,  తాలుకా అధ్యక్షుడు నవీన్ కుమార్, తాలుకా ప్రధాన కార్యదర్శి మల్లెల రాజేష్,  మండలాల అధ్యక్షులు మో హన్‌ ,అనిల్, కిరణ్, మహాత్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు