యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ జాతీయ ఐక్యతకు ప్రమాదం

13 Nov, 2016 23:03 IST|Sakshi
యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ జాతీయ ఐక్యతకు ప్రమాదం
 మతతత్వ ఎజెండాను బీజేపీ  వీడాలి
– బహిరంగ సభలో ఎన్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు తాహెరున్నిసా
 కర్నూలు (ఓల్డ్‌సిటీ):  యూనిఫామ్‌ సివిల్‌కోడ్‌ జాతీయ ఐక్యతకు ప్రమాదకరమని, తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌డబ్లూ​‍్యఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షురాలు తాహెరున్నిసా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం  ఆ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు పాతబస్తీలో ఫ్లెక్సీలు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇస్లామియా జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ముస్లింలపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనిఫామ్‌ సివిల్‌కోడ్‌ పేరుతో ముస్లింలను  ఇబ్బంది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.  మతతత్వ ఎజెండాను తమపై రుద్దితే సహించమని, దాన్ని బీజేపీ వీడాలని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎస్‌డీపీఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్‌వారిస్, ఎన్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రఫాత్‌ సుల్తానా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు