పదవుల పందేరానికి సర్వం సిద్ధం

21 Jun, 2016 11:02 IST|Sakshi

నేడు వెటర్నరీ వర్సిటీ పాలకమండలి సమావేశం
పాతవారిని కొనసాగించేందుకు యత్నాలు
పదవులపై పలువురు ఔత్సాహికుల ఆశలు

చిత్తూరు: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పాలకమండలి తొలి సమావేశం మంగళవారం జరగనుంది. సభ్యులందరూ ఇందులో పాల్గొననున్నారు. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పాలకమండలిని గత నెల 20వ తేదీన పునరుద్ధరించారు. అయితే వీరు ఇంకా అధికారికంగా బాధ్యతలు స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే బోర్డు మీటింగ్‌లో పదవుల పంపకంపైనే ప్రధానంగా చర్చ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.   యూనివర్సిటీక్యాంపస్:

 
వెటర్నరీ యూనివర్సిటీలో ఐదేళ్ల తర్వ తా తొలిసారిగా మంగళవారం పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పదవుల పంపిణీపైనే ప్రధానంగా చర్చ సాగునుంది. ప్రస్తుతం వెటర్నరీ యూనివర్సిటీలో పరిశోధన డీన్, విస్తరణ డీన్, డెయిరీ డీన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీ 11 అధికార పదవుల్లో మూడు ఖాళీగా ఉండ గా, మిగిలిన 8 మంది అధికారుల పదవీ కాలం ఈ నెల 24తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే బోర్డు పాలకమండలి సమావేశంలో పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారిని కొనసాగించేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పదవుల కోసం ఆశలు పెట్టుకున్న కొందరు ఔత్సాహికులు నిరాశకు గురవుతున్నారు. మరికొందరు ఎలాగైనా పాగా వేసేం దుకు పావులు కదుపుతున్నారు. ఐదేళ్ల పాటు పని చేసిన వారినే మళ్లీ పదవుల్లో కొనసాగించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ వీసీ నియామకం జరిగి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని చెబుతున్నారు.

 
ఆ అధికారిపై చర్యలేవి?

శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అతిథి గ ృహంలో నిధుల గోలుమాల్‌కు బాధ్యుడైన అధికారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు. కేవలం విచారణ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగిని బలి చేసి, సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోకపోవడం దురుణమని చెబుతున్నారు. అంతేకాకుండా సదరు అధికారి పదవీ కాలాన్ని పొడగిస్తుస్తారన్న ప్రచారం సాగుతుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ అంశంపై నూతన పాలక మండలి సభ్యులు ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.

 

 

మరిన్ని వార్తలు