యూనివర్సిటీల సమస్యలపై ఉద్యమించాలి

18 Sep, 2016 22:44 IST|Sakshi
  • ఎస్‌ఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
  • ముగిసిన ఆల్‌ వర్సిటీ విద్యార్థుల సమ్మేళనం
  •  
    బాలాజీచెరువు(కాకినాడ) :
    యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వై.వేంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూకే సమావేశపు హాల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆల్‌ యూనివర్సిటీ విద్యార్థుల సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా వేంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1700 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి కనీసావసరాలు తీర్చకుండా ప్రైవేట్‌ వర్సిటీలకు అనుమతి ఇవ్వడం విడ్డూరమన్నారు. కొందరు విద్యావ్యాపారవేత్తలకు లాభం చేకూరేలా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వాలు విడనాడాలన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి దృష్టి పెట్టకపోతే ఎస్‌ఎఫ్‌ఐ సైన్యంలా పోరాడుతుందన్నారు. అందరికీ ఉపకారవేతనాలు ఇవ్వాలని, యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని, అధ్యాపక పోస్టుల భర్తీతో పాటు జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, జిల్లా అధ్యక్షుడు రాజు, దుర్గాప్రసాద్, స్పందన తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు