గుర్తు తెలియని వ్యక్తి మృతి

12 Feb, 2017 00:23 IST|Sakshi
కర్నూలు : సిటీ రైల్వేస్టేషన్‌ శివారులోని సుంకేసుల రోడ్డు బ్రిడ్జికి 200 మీటర్ల దూరంలో పట్టాలపై  ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. అర్ధరాత్రి వేళ ట్రాక్‌ దాటుతుండగా  రైలు ఢీకొట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు రైల్వే ఎస్‌ఐ జగన్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఫోన్‌(83318 89625) ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.   
 
మరిన్ని వార్తలు