పంపిణీ సరే.. నిర్వహణేది?

7 Jul, 2017 03:57 IST|Sakshi
పంపిణీ సరే.. నిర్వహణేది?

పారిశుధ్య కార్మికులు లేక మూలనపడ్డ ట్రైసైకిళ్లు
చాలా గ్రామాల్లో కనిపించని డంపింగ్‌యార్డులు
నెరవేరని చెత్త సేకరణ లక్ష్యం 
పట్టించుకోని అధికారులు

తానూరు(ముథోల్‌):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ పల్లెలను తీర్చదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం లేదు. పల్లెలను పారిశుధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం రూరల్‌ వాటర్‌స్కీం అండ్‌ శాని టేషన్‌ (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామ పంచాయతీకి రెండు, మూడు చొప్పున ట్రైసైకిళ్లను పంపిణీ చేసింది. నిర్మల్‌ జిల్లా 13 మండలాల పరిధిలోని 240 గ్రామ పంచాయతీ లకు ఒక్కోదానికి రూ.20వేల చొప్పున రూ. 1.44 కోట్లు వెచ్చించి 720 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉన్నా కొన్ని చోట్ల మాత్రమే ఉపయోగంలో ఉండగా.. చాలా చోట్ల మూలనపడ్డాయి. పలు మండలాల్లో వీటి ద్వారా చెత్త సేకరిస్తున్నా మిగతా చోట్ల సి బ్బం ది కొరతతో నిరుపయోగంగా మారాయి.  దీం తో పల్లెల్లో ఎక్కడిచెత్త అక్కడే దర్శనమిస్తోంది.
 

నీరుగారుతున్న లక్ష్యం..
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీ ణ) పథకంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రా మాలకు ఏడాది క్రితం ట్రైసైకిళ్లను పంపిణీ చే సింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో వీటి నిర్వహణ బాధ్యతను సంబంధిత సర్పంచ్‌లకు అ ప్పగించింది. ఒక్కో ట్రైసైకిల్‌కు రూ.20 వేల చొ ప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. ఇందులో త డి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు వీ లు కల్పించారు. ఈ సైకిళ్లపై స్వచ్ఛభారత్‌ లోగో ను సైతం ముద్రించారు. గ్రామాల్లో ఉన్న జనా భా ఆధారంగా వీటిని పంపిణీ చేశారు. అయితే నిర్వహణకు తగిన నిధులు లేక సిబ్బంది కోరత కారణంగా సర్కారు లక్ష్యం నీరుగారిపోతోంది.

వేధిస్తున్న సిబ్బంది కొరత ...
జిల్లాలోని సగం గ్రామ పంచాయతీల్లో పారిశు ధ్య కార్మికులు ఒక్కరిద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో సిబ్బంది అందుబాటులో ఉన్న జీపీల్లో మాత్రమే వీటిని ఉపయోగిస్తుండగా మిగతా చో ట్ల నిరుపయోగంగా మారుతున్నాయి. రోజు వారి కూలీలను నియమించేందుకు నిధుల కొర త ఉందని తెలుస్తోంది. సిబ్బంది లేని గ్రామాల్లో ట్రైసైకిళ్లు మూలనపడి శిథిలావస్థకు చేరా యి. అలాగే కొన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు లేక సేకరించిన చెత్తను వేయడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 

ఎక్కడి చెత్త అక్కడే ...
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రైసైకి ళ్లు అందించినా.. పారిశుధ్య సిబ్బంది లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది.  ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్య సిబ్బందిని నియమించి ట్రైసైకిళ్లను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

నిరుపయోగంగా మారాయి
గ్రామాలకు సరఫరా చేసిన ట్రైసైకిళ్లు సిబ్బంది లేక నిరుపయోగంగా మారాయి. దీంతో ఏడాది నుంచి పంచాయతీ కార్యాలయంలో మూలన పడి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సరిపడా పారిశుధ్య కార్మికులను నియమించి చెత్త తొలగించేలా చర్యలు చేపట్టాలి.
–రమేశ్, బోంద్రట్‌
ట్రైసైకిళ్లను ఉపయోగంలోకి తెస్తాం
జిల్లాలోని ఆయా గ్రామాలకు పంపిణీ చేసిన ట్రైసైకిళ్లను త్వరలోనే పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకువస్తాం. ఆయా గ్రామాల్లో డంపింగ్‌యార్డులు లేకపోవడంతో చెత్త సేకరణకు ఇబ్బందవుతోంది. గ్రామాల్లో డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసి ట్రైసైకిళ్ల ద్వారా చెత్త తొలగించి ఉపయోగంలోకి తీసుకువస్తాం.
–గంగాధర్, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి

మండలం    గ్రామ    పంపిణీ చేసిన   పంచాయతీలు                          ట్రైసైకిళ్లు
భైంసా                                                  19                                        60
తానూరు                                              20                                        57
ముథోల్‌                                               21                                        63
కుభీర్‌                                                 20                                         60
లోకేశ్వరం                                           15                                          45
కుంటాల                                             15                                          45
దిలావర్‌పూర్‌                                      15                                          45
కడెం                                                   24                                          72
ఖనాపూర్‌                                           18                                           51
లక్ష్మణ్‌చాంద                                       17                                           51
మామడ                                            13                                             39
నిర్మల్‌                                              25                                              75
సారంగాపూర్‌                                   18                                               54
మొత్తం                                         240                                                720

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది