బసివిని, దేవదాసీలను ఆదుకోవాలి

20 Dec, 2016 22:53 IST|Sakshi
  • ఎస్సీ సంక్షేమ సంఘం డిమాండ్‌
  • అనంతపురం న్యూటౌన్‌ : బసివినీ, దేవదాసీలు, మాతంగుల సంక్షేమానికి పాటు పడాలని  ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరి కారణంగా జీవితం కోల్పోయిన బసివినిలుగా, దేవదాసీలు మారిన  వారి సంక్షేమం కోసం బడ్జెట్‌ రూ.100 కోట్లు కేటాయించాలని, వయస్సుతో నిమిత్తం లేకుండా పింఛన్‌ సౌకర్యం కల్పించాలని, వీరి పిల్లలకు ఉచిత విద్యనందించాలని  డిమాండు చేశారు. కార్యక్రమంలో నరసింహులు, నారాయణ, బాబు, బంగారు రాము, ప్రకాష్, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు