ఉప్పాడకు పొంచిఉన్న ముప్పు

27 Oct, 2016 00:23 IST|Sakshi
ఉప్పాడకు పొంచిఉన్న ముప్పు
భయం గుప్పెట్లో తీరప్రాంతం 
వేట నిలిపి వేసిన మత్స్యకారులు
కానరాని ముందస్తు చర్యలు
పిఠాపురం : అంతా ప్రశాంతం ... నిండుకుండలా సముద్రం , మామూలుకంటే తక్కువ అలలు ... కానీ ఉప్పెన ముంచుకొస్తుందన్న అధికారిక హెచ్చరికలు స్థానిక తీరప్రాంతవాసులను వణికిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ముప్పు ఉందని  హెచ్చరికలు చేస్తున్నంతగా ఉపద్రవం వస్తుందా లేదా అనేదానికంటే బుధవారం ఉదయం నుంచి సముద్రం ఒక్కసారిగా  వెనక్కి వెళ్లిపోవడం మాత్రం స్థానికులను కలవరపెడుతోంది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు అంతగా తుఫాన్‌ముప్పు ఉండదని ముందు అనుకున్నప్పటికీ క్యాంట్‌  పెను తుఫా¯ŒSగా మారి విశాఖకు సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో భయాందోళన‡లు వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్‌హెచ్చరికలు చేసినా పట్టించుకోని మత్స్యకారులు తమ పడవలు, వలలు,  వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవడంలో తలమునకలయ్యారు. స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.తీరప్రాంతంలో సముద్రం సుమారు 50 మీటర్ల వరకు వెనక్కి వెళ్లిపోవడం కూడా దడ పుట్టిస్తోంది. సాధారణంగా తీవ్ర తుఫాన్‌ వచ్చే సమయంలో మాత్రమే ఇలా తీరంలో సముద్రం వెనక్కి (ఆటు) వెళ్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఎటువంటి రక్షణ లేకపోవడంతో తీరానికి సమీపంలో ఉన్న సుబ్బంపేట, పల్లెపేట, కొత్తపేట, రంగంపేట తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. బీచ్‌రోడ్డు ఏ మాత్రం తెగిపోయినా పైగ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఇప్పటికే ఉప్పాడకు రక్షణగా వేసిన జియోట్యూబ్‌ రక్షణ గోడ అండలు జారీ కూలిపోవడంతో ఉప్పాడకు ముప్పు పొంచిఉందని ఆ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
>
మరిన్ని వార్తలు