యూరియాతో బెట్ట నుంచి విముక్తి

27 Aug, 2016 01:11 IST|Sakshi
యూరియాతో బెట్ట నుంచి విముక్తి
దేవనకొండ : ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వాడుపట్టిన పంటలపై యూరియా ద్రావణం పిచికారి చేస్తే బెట్ట నుంచి తాత్కాలికంగా రక్షించుకోవచ్చని ఇక్రిషాట్‌ శాస్త్రవేత్త ప్రభాకర్‌పటాక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన  మండల పరిధిలోని కూకటికొండ, వెలమకూరు గ్రామాల్లో పర్యటించారు. లీటర్‌ నీటికి 10 గ్రా. యూరియా, 2గ్రా. జింక్‌సల్ఫేట్, గ్రాము బోరాన్‌ను కలిపిన ద్రావణాన్ని వాడుపట్టిన వేరుశెనగ పైరుపై పిచికారి చేయడం వల్ల బెట్ట నుంచి పంట కొన్ని రోజులు తట్టుకుంటుందన్నారు.  అదష్టవశాత్తు వర్షాలు కురిస్తే పంటలు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట ఇక్రిషాట్‌ ఎస్‌ఓ ఆదినారాయణ, నల్లచెలిమల ప్రాజెక్టు ఆఫీసర్‌ మధుసూదన్‌ తదితరులున్నారు. 
 
మరిన్ని వార్తలు