ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి

17 Jul, 2016 22:53 IST|Sakshi
ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి

డ్వామా పీడీ హరిత

ఇబ్రహీంపట్నం : ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని డ్వామా పీడీ హరిత అన్నారు. ముకునూర్‌ గ్రామంలో లైఫ్‌ ప్రాజెక్ట్‌ కింద ఉపాధి హామీలో పనిచేస్తున్న యువ రైతులకు ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమకున్న వనరులతోనే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేసుకునే పద్ధతులను నేర్చుకోవాలన్నారు. రసాయనిక ఎరువులను తగ్గించడం వలన నాణ్యమైన పంట చేతికందడంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఆధునిక వ్యవసాయాన్ని సాగుచేసుకునే పద్ధతులను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదం చేస్తుందన్నారు. అనంతరం ఆమె పొల్కంపల్లి, నాగ¯ŒSపల్లి రోడ్ల కిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో లైఫ్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ శ్యామల, సర్పంచ్‌ లక్ష్మమ్మ, ఉపాధి హామీ ఏపీడీ తిరుపతయ్య, టీఏలు బాబురావు, రవి పాల్గొన్నారు.  
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా