నల్లధనం పేరిట నరకం చూపుతున్న మోదీ

12 Nov, 2016 03:34 IST|Sakshi
నల్లధనం పేరిట నరకం చూపుతున్న మోదీ

విదేశాల్లో ఉన్న నల్లధనం వెలికితీయలేదెందుకు?
మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్న జనం
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేరేడుచర్ల/గరిడేపల్లి: కేంద్ర ప్రభుత్వం రూ.500, 1,000 నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని వెలికితీయడమేమోకానీ.. సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. నల్లధనం పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు నరకం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లిలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువస్తామని ఎన్నికల్లో చెప్పిన నరేంద్ర మోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శిం చారు. నల్లకుబేరుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

మోదీ తొందరపాటు చర్యల వల్ల మూడు రోజులుగా సామాన్య జనం ముప్పు తిప్పలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామ ని చెప్పి తన కుటుంబంలో మాత్రమే నలుగురుకి కొలువు లు ఇచ్చుకుని.. నిరుద్యోగ యువతకు మొండిచేరుు చూపించిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకానికి ఇబ్బం దులు లేకుండా నిధులు విడుదల చేస్తే.. ప్రస్తుత ప్రభు త్వం విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోందని మండిపడ్డారు.  డిసెంబర్‌లో హైదరాబాద్ లో రైతు, విద్యా ర్థి గర్జన పేరుతో బహిరంగసభ నిర్వహిస్తామని, దీనికి రాహుల్‌గాంధీ వస్తారని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు